US stock market first quarter

అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాల…
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సామాన్య పేరు అమెరికా, ఉత్తర అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలతో భూసరిహద్దు, అలాస్కా వద్ద రష్యాతో సముద్ర సరిహద్దు ఉంది. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డి.సి.. ఉత్తర దిశలో కెనడా, తూర్పు దిశలో అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ దిశలో మెక్సికో, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున అలాస్కా రాష్ట్రం ఉంది దీనికి పడమరలో బేరింగ్ జలసంధి ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ ద్వీపసమాహారం పసిఫిక్ సముద్రం మధ్యలో ఉంది. అమెరికా ఆధీనంలో పసిఫిక్, కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు వైశాల్యం, 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం, జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకోవడమే కాక, అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యములో మూడవ లేదా నాలుగవ …
  • రాజధాని: వాషింగ్టన్ డి.సి
  • అతి పెద్ద నగరం: న్యూయార్క్
  • జాతీయ భాష: కేంద్ర స్థాయిలో అధికారిక భాష ఏదీ లేదు (28 రాష్ట్రాలలో ఆంగ్లం అధికారిక భాష)
  • ప్రజానామము: అమెరికన్
  • ప్రభుత్వం: కేంద్రీకృత అధ్యక్ష తరహా రాజ్యాంగబద్ధ సమాఖ్య
  • జీడీపీ (PPP): 2008 అంచనా
  • జీడీపీ (nominal): 2008 అంచనా
దీనిలోని డేటా: te.wikipedia.org